సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌కు జమ్మికుంటలో నో ఎంట్రీ.. తనిఖీలు ముమ్మరం.

సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌కు జమ్మికుంటలో నో ఎంట్రీ.. తనిఖీలు ముమ్మరం.

జమ్మికుంట టౌన్ జులై 14 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట పట్టణాన్ని సింగిల్-యూజ్ ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ యంత్రాంగం చర్యలను ముమ్మరం చేసింది. మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి ఆదేశాల మేరకు మంగళవారం పట్టణంలోని వారసంతతో పాటు ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణదారులు, వ్యాపారులకు ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి కలిగే తీవ్ర నష్టాలపై అవగాహన కల్పించారు.
తనిఖీల సందర్భంగా సానిటరీ ఇన్‌స్పెక్టర్ ఇల్లందుల రమేష్ మాట్లాడుతూ, పర్యావరణానికి హానికరమైన ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, ఇతర నిషేధిత సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించవద్దని సూచించారు. ప్లాస్టిక్‌కు బదులుగా వస్త్ర సంచులు, కాగితపు సంచులు వంటి పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని వ్యాపారులను కోరారు.
వ్యాపారులకు మార్పు కోసం వారం రోజుల గడువు ఇస్తున్నామని, ఆ తర్వాత కూడా నిషేధిత ప్లాస్టిక్ వినియోగం కొనసాగిస్తే సంబంధిత దుకాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో సానిటరీ ఇన్‌స్పెక్టర్ ఇల్లందుల రమేష్‌తో పాటు జవాన్ కిరణ్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.IMG-20260714-WA0039.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఇందిరమ్మ ఇళ్లతో పేద కుటుంబాలకు శాశ్వత గూడు. ఇందిరమ్మ ఇళ్లతో పేద కుటుంబాలకు శాశ్వత గూడు.
పెబ్బేరు,జూలై14(తెలంగాణ ముచ్చట్లు): పేద కుటుంబాల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సాకారం చేస్తోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. పెబ్బేరు...
అగ్నిప్రమాద బాధితురాలు రాధమ్మను పరామర్శించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.
ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్ల సమస్యలు పరిష్కరించాలి.
సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌కు జమ్మికుంటలో నో ఎంట్రీ.. తనిఖీలు ముమ్మరం.
నూతన ఎంపీడీవోకు దేవస్థానం చైర్మన్ మర్యాదపూర్వక సన్మానం.
రేపు వనపర్తికి ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. విశారధన్ మహారాజ్.
ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరి వివరాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలి.