27న తెలంగాణ జర్నలిస్టుల "ఛలో పార్లమెంట్".

జంతర్ మంతర్ లో ఒకరోజు ధర్నా.

27న తెలంగాణ జర్నలిస్టుల

ఖమ్మం బ్యూరో,జూలై 11(తెలంగాణ ముచ్చట్లు )

ఖమ్మంకేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ, ఈ నెల 27వ తేదీన "తెలంగాణ జర్నలిస్టుల ఛలో పార్లమెంట్" కార్యక్రమం చేపడుతున్నట్లు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ లు తెలిపారు.
పార్లమెంట్ వర్షాకాల
సమావేశాలు ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నందున దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల డిమాండ్ల సాధనకై ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించినట్లు వారు శనివారం నాడిక్కడ మీడియాకు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో పరిష్కరించాల్సిన జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్ ల పునరుద్దరణ, జర్నలిస్టుల రక్షణ చట్టం, రిటైర్డ్ జర్నలిస్టులకు జాతీయ పెన్షన్ పథకం, జాతీయ మీడియా కమీషన్ ఏర్పాటు తదితర డిమాండ్ల పై 27న ఢిల్లీలోని పార్లమెంట్ వద్ద (జంతర్ మంతర్ లో) ఒక రోజు ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ధర్నా అనంతరం
 పలువురు కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులను కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఛలో పార్లమెంట్ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి జర్నలిస్టులు, టీడబ్ల్యూజేఎఫ్ బాధ్యులు పాల్గొంటారని, అదేవిధంగా ఢిల్లీ, యూపీ తదితర రాష్ట్రాలకు చెందిన ఐఎఫ్ డబ్ల్యూజే నాయకులు కూడా ధర్నాలో పాల్గొంటారని తెలిపారు. దేశవ్యాప్తంగా జర్నలిస్టులకు రైలు ప్రయాణ చార్జీల్లో 50 శాతం రాయితీ కల్పిస్తూ దాదాపు పదిహేనేళ్ళ పాటు కొనసాగిన స్కీం ను కేంద్ర ప్రభుత్వం గత కోవిడ్ సందర్బంగా నిలిపివేసిందని, ఈ సదుపాయాన్ని తిరిగి పునరుద్దరించలేదని, దీంతో జర్నలిస్టులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. జర్నలిస్టుల రైల్వే రాయితీ పాసుల సదుపాయాన్ని పునరుద్దరించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా మీడియా రంగం విస్తరించిన సందర్భంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో "నేషనల్ మీడియా కమీషన్"ను
ఏర్పాటు చేయాలని కోరారు. రిటైర్డ్ జర్నలిస్టులకు కొన్ని రాష్ట్రాలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్ స్కీం అమలు చేస్తున్నప్పటికి జాతీయ స్థాయిలో పెన్షన్ స్కీం లేదని, దేశవ్యాప్తంగా ఒకే పెన్షన్ విధానం ఉండేలా "జాతీయ పెన్షన్ పథకం" అమలు చేయాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అనేక రాష్ట్రాలలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, హత్యలు, అక్రమ కేసులను నిలువరించేందుకు పార్లమెంట్ లో "జర్నలిస్టుల రక్షణ చట్టం" తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాకు పూర్తి స్థాయిలో చట్టబద్దత కల్పించాలని అన్నారు.ఈ డిమాండ్ల సాధనకై 27న జరిగే "ఛలో పార్లమెంట్" కార్యక్రమంలో జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

27న తెలంగాణ జర్నలిస్టుల "ఛలో పార్లమెంట్". 27న తెలంగాణ జర్నలిస్టుల "ఛలో పార్లమెంట్".
ఖమ్మం బ్యూరో,జూలై 11(తెలంగాణ ముచ్చట్లు ) ఖమ్మంకేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ, ఈ నెల 27వ తేదీన "తెలంగాణ జర్నలిస్టుల ఛలో...
15 రోజుల్లో అర్హులందరికీ అక్రిడిటేషన్ లు.
దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి... 
కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా..? అధికారుల వైఫల్యమా..? ఎన్ హెచ్ 765డి జి పై ప్రశ్నల వర్షం.
ఎస్‌ఐఆర్ ప్రక్రియను గ్రామంలో వేగవంతంగా పూర్తి చేయాలి.
వెల్టూర్‌లో ఓటర్ నమోదు సవరణలపై అవగాహన.
ఆరోగ్యవంతమైన బాల్యానికి నులిపురుగుల నివారణ కీలకం.