డాక్టర్ వైఎస్సార్ జయంతి సందర్భంగా ఘన నివాళులు.

మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు.

డాక్టర్ వైఎస్సార్ జయంతి సందర్భంగా ఘన నివాళులు.

హుజురాబాద్, జూలై 8(తెలంగాణ ముచ్చట్లు ):

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా హుజురాబాద్‌లో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని, రైతులు, విద్యార్థులు, పేదలు, మహిళల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేతగా వైఎస్సార్‌ను కొనియాడారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కలిసి వైఎస్సార్‌కు నివాళులర్పించి ఆయన ఆశయాలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .