రెండు కుటుంబాలను పరామర్శించిన మంత్రి తుమ్మల.

రెండు కుటుంబాలను పరామర్శించిన మంత్రి తుమ్మల.

- మందలపల్లిలో అడపా పుష్పావతికి నివాళులు.
- పట్వారిగూడెంలో చెలికాని రంగారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.

దమ్మపేట, జూలై 8 (తెలంగాణ ముచ్చట్లు):

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం సాయంత్రం దమ్మపేట మండలంలోని మందలపల్లి, పట్వారిగూడెం గ్రామాల్లో ఇటీవల మృతిచెందిన ఇద్దరి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మందలపల్లి గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొర తల్లి స్వర్గీయ అడపా పుష్పావతి ఇటీవల కన్నుమూయడంతో మంత్రి తుమ్మల వారి నివాసానికి వెళ్లి పుష్పావతి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత పట్వారిగూడెం గ్రామానికి చేరుకున్న మంత్రి తుమ్మల, ఇటీవల మృతిచెందిన స్వర్గీయ చెలికాని రంగారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజకీయ జీవిత ప్రారంభం నుంచి తనతో కలిసి నడిచిన రంగారావు సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించిIMG-20260708-WA0011 వారి దుఃఖంలో తాను భాగస్వామినని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో దమ్మపేట, అశ్వరావుపేట మండలాల సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, తుమ్మల అభిమానులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .