గోపాల్‌పూర్ క్రాస్ రోడ్డు వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు.

రోడ్డును చదును చేయించిన ముల్కనూర్ ఎస్సై రాజు.

గోపాల్‌పూర్ క్రాస్ రోడ్డు వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు.

భీమదేవరపల్లి,జూన్ 12(తెలంగాణ ముచ్చట్లు): 

మండల పరిధిలోని గోపాల్‌పూర్ క్రాస్ రోడ్డు వద్ద తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు ముల్కనూర్ ఎస్సై రాజు తెలిపారు.

ఈ ప్రాంతంలో రోడ్డు దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రమాదాలకు గురవుతున్న విషయాన్ని గుర్తించిన పోలీసులు శుక్రవారం ప్రత్యేక చర్యలు చేపట్టారు. జేసీబీ యంత్రం సహాయంతో రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చి, రహదారిని పూర్తిగా చదును చేయించారు.

ఈ సందర్భంగా ఎస్సై రాజు మాట్లాడుతూ, ప్రజల ప్రాణ రక్షణే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గోపాల్‌పూర్ క్రాస్ వద్ద ప్రమాదాలను అరికట్టేందుకు ఈ చర్యలు చేపట్టామని, వాహనదారులు వేగ పరిమితులను పాటిస్తూ అప్రమత్తంగా ప్రయాణించాలని సూచించారు.

రోడ్డును మరమ్మతు చేసి ప్రమాదాల నివారణకు కృషి చేసిన ఎస్సై రాజు మరియు పోలీస్ సిబ్బందిని స్థానిక ప్రజలు, వాహనదారులు అభినందించారు. ఈ చర్యలతో గోపాల్‌పూర్ క్రాస్ వద్ద ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .