భీమదేవరపల్లి వెటర్నరీ హాస్పిటల్‌లో నూతన వైద్యాధికారిగా డాక్టర్ రోజా బాధ్యతల స్వీకరణ.

భీమదేవరపల్లి వెటర్నరీ హాస్పిటల్‌లో నూతన వైద్యాధికారిగా డాక్టర్ రోజా బాధ్యతల స్వీకరణ.

భీమదేవరపల్లి, జూన్ 3 (తెలంగాణ ముచ్చట్లు):

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రిలో నూతన వెటర్నరీ వైద్యాధికారిగా డాక్టర్ రోజా బాధ్యతలు స్వీకరించారు. ఆమె గతంలో కేశవపూర్ వెటర్నరీ ఆసుపత్రిలో విధులు నిర్వహించగా, బదిలీపై భీమదేవరపల్లికి వచ్చి తన కొత్త బాధ్యతలను చేపట్టారు.

ఈ సందర్భంగా డాక్టర్ రోజాకు ఆసుపత్రి సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, పశుపాలకులు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మండలంలోని పశుపాలకులకు నాణ్యమైన, సకాలంలో వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

పశువులకు అవసరమైన టీకాలు, చికిత్సలు, అత్యవసర వైద్య సేవలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా ప్రత్యేక చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అలాగే మండలంలోని పశుసంపద అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తూ రైతులు, పశుపాలకులకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, స్థానిక నాయకులు, పశుపాలకులు పాల్గొని నూతన వైద్యాధికారికి అభినందనలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .