తల్లి మృతితో అనాథగా మారిన భవ్యశ్రీకి ఎమ్మెల్యే మేఘారెడ్డి అండ.

నేను చదువు, భవిష్యత్తు బాధ్యత నాది అంటూ భవ్యశ్రీ కి ఎమ్మెల్యే భరోసా.

తల్లి మృతితో అనాథగా మారిన భవ్యశ్రీకి ఎమ్మెల్యే మేఘారెడ్డి అండ.

పెద్దమందడి,జూన్03(తెలంగాణ ముచ్చట్లు):

జీవితంలో ఒకరి తర్వాత ఒకరిని కోల్పోతూ చివరకు తల్లినీ కోల్పోయిన ఓ చిన్నారి విషాదగాథ వనపర్తి జిల్లా  పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామంలో ప్రతి ఒక్కరినీ కదిలించింది. చిన్న వయసులోనే అవ్వ, తాత, తండ్రి మరణించగా, ఇటీవల తల్లి కూడా కన్నుమూయడంతో భవ్యశ్రీ అనే బాలిక పూర్తిగా అనాథగా మారింది. ఆమె దుస్థితి తెలిసిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి స్పందించి అండగా నిలవడంతో చిన్నారికి కొత్త ఆశలు చిగురించాయి.దొడగుంటపల్లి గ్రామానికి చెందిన రేణుక ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ తన ఏకైక కుమార్తె భవ్యశ్రీని పెంచింది. భర్త లేకపోవడం, తల్లిదండ్రులు లేకపోవడం వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ కుమార్తె భవిష్యత్తు కోసం ఆమె నిరంతరం శ్రమించింది.అయితే దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న రేణుక ఆరోగ్యం గత కొంతకాలంగా క్షీణించడంతో ఇంటికే పరిమితమైంది.మంగళవారం రాత్రి ఆమె ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోవడంతో రేణుక మృతి చెందింది. తల్లిని కోల్పోయిన భవ్యశ్రీ విలపించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.ఇప్పుడు నన్నెవరు చూసుకుంటారు?  అనే ఆమె మౌన ప్రశ్న గ్రామస్థుల మనసులను కలచివేసింది.ఇక రేణుక అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా కుటుంబానికి ఆర్థిక స్థోమత లేకపోవడంతో గ్రామస్థులే ముందుకు వచ్చి చందాలు సేకరించి దహన సంస్కారాలు నిర్వహించారు. గ్రామ ప్రజలు చూపిన మానవత్వం అందరి ప్రశంసలు అందుకుంది.ఈ విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వెంటనే స్పందించారు. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా తక్షణ సాయంగా రూ.5,000/- అందజేశారు. అనంతరం చిన్నారి భవ్యశ్రీతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆమె చదువు ఆగకుండా చూసుకుంటానని, భవిష్యత్తుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.నీవు ఒంటరిగా లేవు... నీ చదువు, భవిష్యత్తు బాధ్యతను నేను తీసుకుంటాను అని ఎమ్మెల్యే చెప్పిన మాటలు భవ్యశ్రీకి ధైర్యాన్ని నింపాయి.ఎమ్మెల్యే స్పందనపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ, చిన్నారి భవిష్యత్తుపై ఆయన చూపిన చొరవను అభినందించారు.ఒక చిన్నారి జీవితంలో చీకట్లు అలుముకున్న సమయంలో సమాజం, ప్రజాప్రతినిధులు అండగా నిలిస్తే ఆశలు మళ్లీ చిగురిస్తాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .