కాజీపేటలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవం.
కాజీపేట్, ఆగస్టు 15 (తెలంగాణ ముచ్చట్లు)
80 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కాజీపేట్ నగరంలో వాడ వాడ లో త్రివన్న పతాకాన్ని ఎగర వేసి దేశభక్తిని చాటుకున్నారు. డీజిల్ ఇనిస్ట్యూట్ లో సీనియర్ డిఎంఈ వెంకట్ కుమార్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ డి ఎం ఈ వెంకట్ కుమార్ నూతనంగా తీసుకొచ్చిన బిలియర్ స్నూకర్ టేబుల్, క్యారమ్స్ లతోపాటు వాలీబాల్ షటిల్, చెస్ ఆటల పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలలో బిలియర్డ్స్ లో రవి కిరణ్, అంతయ్య స్నూకర్ లో రవికిరణ్, హరి భాస్కర్ క్యారమ్స్ లో రాముల సదానందం , జి. శ్రీనివాస్ చెస్ లో వి సాయికృష్ణ, జె సురేందర్ వాలీబాల్ విన్నర్స్ ఎం 2 టీం అండ్ రన్నర్స్ టీం మహిళా విజేతలు విజయ, హారిక, సుస్మిత లకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఎంఈ అనికేత్ కాడే దంపతులు, ఏ డి ఎం ఈ 1 బి. శ్రీనివాసరావు, ఎడిఎంఈ 2 వి ఆర్ నాగరాజా దంపతులు ఏ డి ఈ సతీష్ ఏసీఎంటి మల్లికార్జునరావు దంపతులు లతోపాటు మజ్దూర్ యూనియన్ నాయకుడు వేద ప్రకాష్ ఇన్స్టిట్యూట్ కమిటీ సభ్యులు సల్మాన్ రాజ్, రాముల సదానందం, శంకర్, భాస్కర్ రెడ్డి, అంతోని స్వామి, నరసయ్య, అమలారావు, ఎల్ ఎఫ్ రాజశేఖర్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ తుఫాన్ అండ్ కార్స్ యూనియన్ కాజీపేటలో కాటా పూర్ రాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దాస్యం విజయభాస్కర్ హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బొట్టు రాజు, ధర్మరాజు, నరసయ్య, నక్క మల్లయ్య ,పరమేష్, రాము, రమేష్, బాలస్వామి, మహమూద్, చిన్న యాదవ్, సదానందం కుమార్, సన్ని తోపాటు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.


Comments