అశ్వరావుపేట డివిజనల్ కార్యదర్శిగా సతీష్ కుమార్.
- ప్రజల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తా.
- బాధితులకు అండగా నిలుస్తా.
దమ్మపేట, ఆగస్టు 15(తెలంగాణ ముచ్చట్లు):
స్పాట్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ భద్రాద్రి జిల్లా ఆధ్వర్యంలో అశ్వరావుపేట డివిజనల్ కార్యదర్శిగా సతీష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు దమ్మపేట మండల రెవెన్యూ తహసీల్దార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (అండర్ ట్రైనీ) మద్దినేని మురళి చేతుల మీదుగా సతీష్ కుమార్‌కు నియామక గుర్తింపు కార్డును అందజేశారు. అనంతరం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో డివిజనల్ కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర కమిటీ చైర్మన్ వెంకన్న నాయక్, సందీప్ కుమార్, పి. రామారావు, వీరస్వామి, ఖమ్మం జిల్లా చైర్మన్ నందు నాయక్, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు వీర ప్రతాప్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. ప్రజల హక్కుల పరిరక్షణతో పాటు అవినీతి నిర్మూలనకు తన వంతు కృషి చేస్తానన్నారు. హక్కుల ఉల్లంఘనకు గురైన బాధితులకు అండగా నిలిచి, వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని తెలిపారు. అసోసియేషన్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని సతీష్ కుమార్ స్పష్టం చేశారు.


Comments