హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ విజయవంతం.

జాతీయ జెండాలతో బీజేపీ శ్రేణుల సందడి.

హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ విజయవంతం.

జమ్మికుంట టౌన్, ఆగస్టు 14 (తెలంగాణ ముచ్చట్లు):

కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు రాజేష్‌ ఠాకూర్‌, జమ్మికుంట పట్టణ బీజేపీ అధ్యక్షులు కొలకాని రాజు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. జాతీయ జెండాలతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తి నినాదాలతో ఉత్సాIMG-20260814-WA0015హంగా ముందుకు సాగారు.
ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు సాయిని మల్లేశంను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
అనంతరం మాజీ కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆత్మీయంగా పలకరించారు. పార్టీ కోసం ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ అభినందనలు తెలిపారు.
దేశ స్వాతంత్ర్య స్ఫూర్తి, జాతీయ ఐక్యతను ప్రజల్లో మరింత పెంపొందించాలనే లక్ష్యంతో హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు యువతలో దేశభక్తి, జాతీయ భావాలను పెంపొందించేలా కార్యక్రమాన్ని నిర్వహించారు.
పార్టీ నాయకులు అడువల శ్రీధర్‌, రాయబారపు సురేష్‌, గణేష్‌తో పాటు కార్యకర్తల సమిష్టి కృషితో ర్యాలీ విజయవంతంగా ముగిసింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ విజయవంతం. హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ విజయవంతం.
జమ్మికుంట టౌన్, ఆగస్టు 14 (తెలంగాణ ముచ్చట్లు): కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా...
ప్రభుత్వానికి రూ.2.42 కోట్ల నష్టం.. రైస్ మిల్ యజమాని అరెస్ట్.
పోచమ్మ తల్లి ఆలయంలో బోరుబావికి శ్రీకారం.
పేదల సంక్షేమ పథకాల పరిరక్షణలో ప్రభుత్వం విఫలం.
విద్యారంగ సమస్యలపై యూఎస్పీసీ సమరభేరి.
సత్తుపల్లిలో 6.36 కిలోల గంజాయి పట్టివేత.
IIIT సీటు సాధించిన హాసినికి సర్పంచ్ ఆర్థిక సాయం.