జైలు భరో కార్యక్రమానికి కేవీపీఎస్ మద్దతు.

జైలు భరో కార్యక్రమానికి కేవీపీఎస్ మద్దతు.

* ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలతో కలిసి పోరాటం

* కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు వడ్లూరి కిషోర్

జమ్మికుంట టౌన్ ఆగస్టు 09 (తెలంగాణ ముచ్చట్లు):

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజా సంఘాలు నిర్వహించనున్న జైలు భరో కార్యక్రమానికి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మద్దతు ప్రకటించింది. ఈ మేరకు కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు వడ్లూరి కిషోర్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధానాలను అవలంబించడం వల్ల కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. పేదలకు అండగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.
అదేవిధంగా రైతులకు కనీస మద్దతు ధర కల్పించకుండా రైతాంగానికి నష్టం కలిగించే విధానాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని ఆరోపించారు. కార్మికుల హక్కులను కాలరాసేలా 29 కార్మిక చట్టాలను నాలుగు కార్మిక కోడ్‌లుగా మార్చారని, దీనివల్ల కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.
ప్రజా సమస్యలపై కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించేందుకు నిర్వహిస్తున్న జైలు భరో కార్యక్రమంలో ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు వడ్లూరి కిషోర్ పిలుపునిచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News