కృష్ణవేణి హైస్కూల్‌లో ఘనంగా గ్రీన్ డే వేడుకలు.
విద్యార్థులతో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, ఆటపాటలు.. ఉత్సాహంగా పోటీలు.
జవహర్ నగర్. ఆగస్ట్ 8(తెలంగాణ ముచ్చట్లు):
జవహర్‌నగర్: కీసర సర్కిల్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జన్మభూమి నగర్‌లో ఉన్న కృష్ణవేణి హైస్కూల్‌లో శనివారం గ్రీన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు, వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేలా పలు కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల బాలబాలికలతో ప్రత్యేకంగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా పాల్గొని తమ సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించారు. అనంతరం విద్యార్థులతో ఆటపాటలు నిర్వహించి, వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. గ్రీన్ డే సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం, పచ్చదనం ప్రాధాన్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రకృతిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడంతో కృష్ణవేణి హైస్కూల్‌లో గ్రీన్ డే వేడుకలు సందడిగా సాగాయి.


Comments