విద్యార్థుల దాహార్తి తీర్చిన రామ్‌కీ ఫౌండేషన్.
పెద్దమందడి,జూలై27(తెలంగాణ ముచ్చట్లు):
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంక్షేమానికి చేయూతనందిస్తూ రామ్‌కీ ఫౌండేషన్ మరో సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. పెద్దమందడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న సుమారు 350 మంది విద్యార్థినీ, విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉండేలా ఆర్.ఓ. మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి పాఠశాలకు అందజేసింది.గ్రామానికి చెందిన ప్రసన్న కుమార్ రెడ్డి చొరవతో ఈ ఆర్.ఓ. ప్లాంట్ ఏర్పాటు కావడంతో విద్యార్థులకు నాణ్యమైన, సురక్షితమైన తాగునీరు అందుబాటులోకి వచ్చింది. ఈ సౌకర్యం ద్వారా విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఎంతో మేలు చేకూరనుందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శాంతన్న మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సేవా సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. విద్యార్థుల అవసరాన్ని గుర్తించి ఆర్.ఓ. ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన రామ్‌కీ ఫౌండేషన్‌కు, అలాగే ఈ కార్యక్రమం అమలుకు ప్రత్యేక చొరవ చూపిన ప్రసన్న కుమార్ రెడ్డి కి పాఠశాల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.


Comments