జమ్మికుంటలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు..
* గాంధీ చౌరస్తాలో కేక్ కట్ చేసిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్.

జమ్మికుంట, జులై 24(తెలంగాణ ముచ్చట్లు)
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను జమ్మికుంట పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం ఘనంగా నిర్వహించాయి. స్థానిక గాంధీ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పాల్గొని కేక్ కట్ చేసి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి కేటీఆర్ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కేటీఆర్ ఇలాంటి మరెన్నో జన్మదిన వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులతో నిండి దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్షించారు.
అనంతరం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేటీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, కేక్ పంపిణీ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments