బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నాయకుడు శీలం ఉదయ్.

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్.

బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నాయకుడు శీలం ఉదయ్.

జమ్మికుంట టౌన్ జులై 24 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట మున్సిపాలిటీ 10వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు శీలం ఉదయ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 10వ వార్డు కాంగ్రెస్ ఇన్‌చార్జి శీలం అశోక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ పార్టీ కండువా కప్పి ఉదయ్‌ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా శీలం ఉదయ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై పార్టీలో చేరానని తెలిపారు. 10వ వార్డులో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ముఖ్యంగా మహిళలకు అందిస్తున్న పథకాలను ప్రతి ఇంటికి చేరేలా కృషి చేస్తానని, నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ నాయకత్వంలో పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు న్యాలకంటి రవి, శీలం సుమంత్, గణేష్‌తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News