సేవా కార్యక్రమాలతో మాజీ ఎంపీ వినోద్ కుమార్ జన్మదినోత్సవం.
జమ్మికుంట టౌన్ జూలై 22 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలను బుధవారం బీఆర్ఎస్వి జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు కొమ్ము నరేష్ ఆధ్వర్యంలో జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మారుతి నగర్‌లో ఉన్న శ్రీ సత్యసాయి మానసిక వికలాంగుల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీ వినోద్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేసి వారితో ఆప్యాయంగా మమేకమయ్యారు.
ఈ సందర్భంగా కొమ్ము నరేష్, 8వ వార్డు కౌన్సిలర్ కొలుగూరి సురేష్, జవాజి అనిల్ మాట్లాడుతూ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ప్రజాసేవకు ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తూ సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన జన్మదిన వేడుకలను ప్రత్యేక అవసరాలున్న చిన్నారుల మధ్య నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.
పాఠశాల నిర్వాహకులు సూత్రం బుచ్చిరాములు మాట్లాడుతూ, విద్యార్థుల మధ్య జన్మదిన వేడుకలు నిర్వహించి ఆనందాన్ని పంచిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు విద్యార్థులకు ఉత్సాహాన్ని, సమాజానికి స్ఫూర్తిని అందిస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి నాయకులు చింతల కౌశిక్, శ్రీనివాస్, గురుకుంట్ల మధుకర్, మేకల రవీందర్, శివకుమార్, సన్నీ, సంపత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments