గోశాల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలం కోరిన మహిళా కాంగ్రెస్.
జమ్మికుంట టౌన్ జులై (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణంలో నిరాశ్రయ గోమాతల సంరక్షణకు శాశ్వత పరిష్కారం కల్పించేలా గోశాల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కోరుతూ పట్టణ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పూదరి రేణుక శివకుమార్ గౌడ్ జమ్మికుంట తహసీల్దార్ (ఎంఆర్వో)కు సోమవారం వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పట్టణంలో సంచరిస్తున్న నిరాశ్రయ పశువుల వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అదే సమయంలో గోమాతల సంరక్షణ కూడా అత్యవసరంగా మారిందని వివరించారు. గోశాల ఏర్పాటు ద్వారా గోమాతలకు రక్షణ కల్పించడంతో పాటు పట్టణంలో ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాల నివారణకు కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు.
వినతిని స్వీకరించిన తహసీల్దార్ సమస్య ప్రాముఖ్యతను శ్రద్ధగా ఆలకించి, ప్రభుత్వ నిబంధనల మేరకు పరిశీలించి గోశాల ఏర్పాటుకు అవసరమైన స్థలం కేటాయింపుపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ప్రజా సమస్యల పట్ల సానుకూల దృక్పథంతో స్పందించిన తహసీల్దార్‌కు పూదరి రేణుక శివకుమార్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. జమ్మికుంటలో త్వరలోనే గోశాల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలం మంజూరై గోమాతల సంరక్షణకు శాశ్వత పరిష్కారం లభించాలని ఆకాంక్షించారు.


Comments