40 ఏళ్ల కాంగ్రెస్‌కు గుడ్‌బై.. బీఆర్‌ఎస్‌లో చేరిన పానుగంటి రాము.

40 ఏళ్ల కాంగ్రెస్‌కు గుడ్‌బై.. బీఆర్‌ఎస్‌లో చేరిన పానుగంటి రాము.

వనపర్తి, జూలై14(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా చిమనగుంటపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త పానుగంటి రాము తన అనుచరులతో కలిసి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి నిరంజన్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా పానుగంటి రాము మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మేఘా రెడ్డి గెలిస్తే తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి వరకు మా గ్రామం నుండి పాదయాత్ర చేస్తామని మొక్కుకున్నామని, ఎమ్మెల్యే విజయం సాధించిన తర్వాత మొక్కు ప్రకారం పాదయాత్ర చేసి స్వామివారిని దర్శించుకున్నామని తెలిపారు. ఎమ్మెల్యే గెలుపు కోసం వ్యక్తిగతంగా శ్రమించడంతో పాటు సొంత డబ్బులు ఖర్చు పెట్టి పార్టీ విజయానికి కృషి చేశామన్నారు..అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండా మోసిన తమలాంటి కార్యకర్తలను పూర్తిగా విస్మరించారని, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారికే పదవులు, ప్రాధాన్యం కల్పిస్తున్నారని ఆరోపించారు. గ్రామస్థాయి కార్యకర్తల మాటకు విలువ లేకుండా పోయిందని, పలుమార్లు సమస్యలను నాయకుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేఘా రెడ్డి మాటలు నీటి మూటలు అంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కూడా అమలు కాలేదని విమర్శించారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా రైతులు, మహిళలు, నిరుద్యోగులు, కార్మికులు, విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో రైతులకు మెరుగైన పరిస్థితులు ఉండేవని, ప్రస్తుతం రైతు భరోసా, రుణమాఫీ, రైతు బీమా, యూరియా కొరత, విద్యుత్ కోతలు, ధాన్యానికి గిట్టుబాటు ధర, బోనస్ వంటి అంశాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.ఈ పరిస్థితుల్లో నియోజకవర్గ అభివృద్ధి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నాయకత్వంలోనే సాధ్యమనే విశ్వాసంతో మండల నాయకుల సహకారంతో బీఆర్‌ఎస్ పార్టీలో చేరినట్లు పానుగంటి రాము స్పష్టం చేశారు.పానుగంటి రాముతో పాటు గోర్ల రాము, కొమ్ము నాగయ్య, గార్ల రాము, కురుమయ్య, భగవంతు, నరేష్, అభిషేక్, చరణ్ తదితరులు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో వాకిటి శ్రీధర్, మాణిక్యం, ధర్మా నాయక్, మహేశ్వర్ రెడ్డి, చిట్యాల రాము, ధర్మశాస్త్రి, భగవంతు యాదవ్, శంశుద్దీన్, అంజి, సత్యనారాయణ చారి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఇందిరమ్మ ఇళ్లతో పేద కుటుంబాలకు శాశ్వత గూడు. ఇందిరమ్మ ఇళ్లతో పేద కుటుంబాలకు శాశ్వత గూడు.
పెబ్బేరు,జూలై14(తెలంగాణ ముచ్చట్లు): పేద కుటుంబాల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సాకారం చేస్తోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. పెబ్బేరు...
అగ్నిప్రమాద బాధితురాలు రాధమ్మను పరామర్శించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.
ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్ల సమస్యలు పరిష్కరించాలి.
సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌కు జమ్మికుంటలో నో ఎంట్రీ.. తనిఖీలు ముమ్మరం.
నూతన ఎంపీడీవోకు దేవస్థానం చైర్మన్ మర్యాదపూర్వక సన్మానం.
రేపు వనపర్తికి ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. విశారధన్ మహారాజ్.
ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరి వివరాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలి.