సంగీతం, సాహిత్యం, కళల్లో పిల్లలను ప్రోత్సహించాలి.
పలుస శంకర్ గౌడ్ జిల్లా సాహితీ కళావేదిక అధ్యక్షులు .
మహబూబ్‌నగర్,జూలై12(తెలంగాణ ముచ్చట్లు):
సంగీతం, సాహిత్యం, కళారంగాల్లో పిల్లలను చిన్ననాటి నుంచే ప్రోత్సహిస్తే వారి ప్రతిభ వెలుగులోకి రావడంతో పాటు నైతిక విలువలు కూడా పెంపొందుతాయని వనపర్తి జిల్లా సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు.మహబూబ్‌నగర్ పట్టణంలోని భగీరథ కాలనీలో నివాసముంటున్న యాదమ్మ–శ్రీనివాస్ దంపతుల కుమారుడు, బాల గాయకుడు ఎన్‌బీఆర్ సాత్విక్‌ను పలుస శంకర్ గౌడ్ ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చిన్ననాటి నుంచే తల్లిదండ్రులు అందించే ప్రోత్సాహమే పిల్లలను ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని అన్నారు. ఎన్‌బీఆర్ సాత్విక్ చిన్న వయస్సులోనే గాయకుడిగా ప్రతిభ కనబరుస్తుండడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్లో ఉన్న ఆసక్తిని గుర్తించి సంగీతం, సాహిత్యం, కళారంగాల్లో ప్రోత్సహించాలని సూచించారు. తద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందుతాయని తెలిపారు.బాల గాయకుడిగా సాత్విక్‌ను తీర్చిదిద్దుతున్న తల్లిదండ్రులు యాదమ్మ, శ్రీనివాస్‌లను ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో అమ్మాపూర్ ప్రధానోపాధ్యాయులు బి. శ్రీనివాస్, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


Comments