ఘనంగా పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ 62వ జన్మదిన వేడుకలు.

ఘనంగా పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ 62వ జన్మదిన వేడుకలు.

వనపర్తి,జులై 07(తెలంగాణ ముచ్చట్లు):

పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ 62వ జన్మదినోత్సవం, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాదిగ ఉద్యోగుల సమాఖ్య వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల భారత మాదిగ ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షులు శ్రీ గద్వాల కృష్ణ హాజరై, జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చౌక్ వద్ద కేక్ కోసి జన్మదిన వేడుకలను ప్రారంభించారు.అనంతరం జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించి, అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు యాపిల్లు, అరటిపండ్లు పంపిణీ చేసి మానవతా సేవలను చాటిచెప్పారు.ఈ కార్యక్రమాన్ని మాదిగ ఉద్యోగుల సమాఖ్య జిల్లా అధ్యక్షులు బొరెల్లి వెంకటయ్య, సీనియర్ నాయకులు కేశపాగ కేశవులు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కొమ్ము కేశవులు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా మాదిగ ఉద్యోగుల సమాఖ్య, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పద్మశ్రీ మంద కృష్ణ మాదిగకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక న్యాయం, సమాన హక్కుల సాధన కోసం ఆయన చేస్తున్న నిరంతర పోరాటాన్ని కొనియాడారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .