వీణవంకలో మార్కెట్ కమిటీ చైర్మన్ స్వప్న–సదానందంకు ఘన సన్మానం.
జమ్మికుంట జూలై 3 (తెలంగాణ ముచ్చట్లు):
వీణవంక మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న–సదానందంను మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వీణవంక మండల మాజీ అధ్యక్షుడు ఎండీ సాహెబ్ హుస్సేన్, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, డైరెక్టర్ నల్లగొని సతీష్‌లు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
అనంతరం చైర్మన్ పుల్లూరి స్వప్న–సదానందం మాట్లాడుతూ, మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వీణవంక మండలంలో ప్రభుత్వ కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉందన్నారు. మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.
అలాగే పార్టీలకు అతీతంగా మండలంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై తనకు సమాచారం అందిస్తే, వాటి విజయవంతానికి అవసరమైన సహకారం అందిస్తానని
హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Comments