చేనేత కార్మికుల సేవే లక్ష్యంగా నూతన పాలకవర్గం.

అధ్యక్షుడిగా కొలిపాక సంపత్.. 

చేనేత కార్మికుల సేవే లక్ష్యంగా నూతన పాలకవర్గం.

జమ్మికుంట టౌన్ జూన్ 26 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లిలో గల బాలాజీ చేనేత సహకార సంఘం పాలకవర్గ ఎన్నికలు శుక్రవారం ఎన్నికల అధికారి శ్రీమతి అరుణ జ్యోతి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా నిర్వహించారు.

ఈ ఎన్నికల్లో సంఘం అధ్యక్షుడిగా కొలిపాక సంపత్, ఉపాధ్యక్షుడిగా ఆడెపు రాజయ్య, కోశాధికారిగా వల్లంపట్ల బాబు ఎన్నికయ్యారు. పాలకవర్గ సభ్యులుగా మూడుతనపల్లి రమేష్, శ్రీరాం రాజు, మహారాజు స్వరూప, శారద, ఓల్లాల రజిత, మూడుతనపల్లి రాజమణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులను కోర్కల్ చేనేత సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ, జమ్మికుంట చేనేత సంఘం అధ్యక్షుడు రమేష్, కొత్తపల్లి మాజీ సర్పంచ్ బొద్దుల రవీందర్, చేనేత సంఘం మాజీ అధ్యక్షుడు కొంపల్లి రాజయ్య, సంఘ నాయకుడు ఆడెపు రాజనర్స తదితరులు శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా నూతన పాలకవర్గం చేనేత కార్మికుల సంక్షేమం, సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .