సీతారాముల ప్రతిమతో హరీష్‌రావుకు ఘన స్వాగతం.

సీతారాముల ప్రతిమతో హరీష్‌రావుకు ఘన స్వాగతం.

- పార్టీ నేతలతో ఆత్మీయ సమావేశం.
- హరీష్‌రావును కలిసిన సోయం వీరభద్రం.

అశ్వరావుపేట, జూన్ 23 (తెలంగాణ ముచ్చట్లు):

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో మంగళవారం నిర్వహించిన బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) అవగాహన సదస్సుకు రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు హాజరయ్యాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావును బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు సోయం వీరభద్రం మర్యాదపూర్వకంగా కలిశారు. దమ్మపేట మండల కేంద్రంలోని మాజీ సొసైటీ చైర్మన్ రావు జోగేశ్వరరావు నివాసంలో జరిగిన సమావేశంలో రావు జోగేశ్వరరావు ఆధ్వర్యంలో, కొమ్ముగూడెం సర్పంచ్ సోయం సత్యవతితో కలిసి హరీష్‌రావుకు భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి ప్రతిమను జ్ఞాపికగా అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులు, సభ్యత్వ నమోదు కార్యక్రమం, క్షేత్రస్థాయి కార్యకలాపాలపై ఆయనతో సంక్షిప్తంగా చర్చించినట్లు నాయకులు తెలిపారు. అనంతరం మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను కూడా సోయం వీరభద్రం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అశ్వరావుపేట నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ ఉప్పతల వెంకటరమణను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కూకలకుంట రమేష్, కీసరి మల్లికార్జునరావు, సోయం వెంకన్నబాబు, వూకే నరసింహరావుతో పాటు పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.IMG-20260623-WA0070

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .