మాజీ సర్పంచ్ అనసూయమ్మ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ.

మాజీ సర్పంచ్ అనసూయమ్మ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ.

వనపర్తి,జూన్20(తెలంగాణ ముచ్చట్లు):

తాటిపాముల గ్రామ మాజీ సర్పంచ్  అనసూయమ్మ రెండో వర్ధంతి సందర్భంగా తాటిపాముల ఉన్నత ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ వార్డు సభ్యుడు గోవింద్, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో విద్యార్థులకు పలకలు, గణిత పరికరాలు, కలాలు, పెన్సిళ్లు, రబ్బర్లు, కొలత పట్టీలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామచంద్రయ్య మాట్లాడుతూ.. గ్రామ పెద్దల సహకారంతో పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలని కోరారు. మాజీ సర్పంచ్ అనసూయమ్మ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రి అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.కార్యక్రమంలో వార్డు సభ్యుడు గోవింద్, మత్స్యకార సంఘం అధ్యక్షుడు శంకరయ్య, వెంకన్న, గోపాల్, బోయ శ్రీను, గంధం విష్ణు, చంద్రయ్య, ఉపాధ్యాయ సంఘ జిల్లా నాయకుడు బి. శ్రీను, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనసూయమ్మ సేవలను స్మరించుకుంటూ ఆమె ఆశయాలకు అనుగుణంగా విద్యాభివృద్ధికి కృషి చేయాలని పలువురు పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .