ఖమ్మంలో ఘనంగా టాలీ సర్టిఫైడ్ పార్టనర్ సంస్థ ఆఫీస్ ప్రారంభం.

ఖమ్మంలో ఘనంగా టాలీ సర్టిఫైడ్ పార్టనర్ సంస్థ ఆఫీస్ ప్రారంభం.

- ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా జీఎస్టీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు  ఉల్లిబోయిన సైదులు 

ఖమ్మం బ్యూరో , జూన్ 18(తెలంగాణ ముచ్చట్లు )

వ్యాపారాల అకౌంటింగ్, ఈ ఆర్ పి అవసరాలకు ట్యాలీ సాఫ్ట్‌వేర్ విక్రయాలు, ఈ ఆర్ పి పరిష్కారాలు మరియు సాంకేతిక సహాయ సేవలను అందించే ఎలైట్  ఈ ఆర్ పి సొల్యూషన్స్ ( విఎల్ఎస్ కార్పొరేట్ సర్వీసెస్) సంస్థ ఖమ్మం వైరా రోడ్డులోని సురభి హాస్పిటల్ కాంప్లెక్స్, 2వ అంతస్తులో ఘనంగా ప్రారంభమైంది.

సంస్థ యజమాని గరిడేపల్లి నరేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ రీజినల్ హెడ్ ఉమేష్ ప్రసాద్ , అఖిల భారత పన్ను నిపుణుల సమాఖ్య జాతీయ కార్యవర్గ సభ్యులు, ఖమ్మం జిల్లా జీఎస్టీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు  ఉల్లిబోయిన సైదులు  ముఖ్య అతిథులుగా హాజరై సంయుక్తంగా రిబ్బన్ కత్తిరించి సంస్థను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇప్పటి వరకు హైదరాబాద్, బెంగళూరు కేంద్రాల నుండి అందుబాటులో ఉన్న ట్యాలీ సేవలు ఇకపై ఖమ్మంలోనే ప్రత్యక్షంగా లభించడం వల్ల జిల్లా వ్యాప్తంగా టాక్స్ ప్రొఫెషనల్స్, చార్టర్డ్ అకౌంటెంట్లు, వ్యాపార సంస్థలకు మరింత వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందనున్నాయని తెలిపారు. అలాగే ఖమ్మం జిల్లా జీఎస్టీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తరఫున సంస్థ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.

ట్యాలీ సర్టిఫైడ్ శిక్షణ నిపుణులు సీఏ బద్రీనాథ్ నకిరికంటి మాట్లాడుతూ, ట్యాలీ సాఫ్ట్‌వేర్ ప్రాముఖ్యత, వ్యాపార నిర్వహణలో దాని పాత్రతో పాటు తాజా వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చిన ఆధునిక ఫీచర్లను వివరించారు. ఈ అవగాహన సదస్సు పాల్గొన్న వారిలో విశేష ఆసక్తిని కలిగించింది.

సంస్థ యజమాని గరిడేపల్లి నరేష్ కుమార్ మాట్లాడుతూ, ట్యాలీ సాఫ్ట్‌వేర్ విక్రయాలు, ఇన్‌స్టాలేషన్, అప్‌గ్రేడేషన్, ఏఎంసి సేవలు, సాంకేతిక సహాయం, జీఎస్టీ సంబంధిత సేవలు, వినియోగదారులకు శిక్షణతో పాటు సమగ్ర ఈఆర్పి పరిష్కారాలను అందించనున్నట్లు తెలిపారు. ఖమ్మం మరియు పరిసర ప్రాంతాల వ్యాపార సంస్థలకు నాణ్యమైన, విశ్వసనీయ సేవలను అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా జీఎస్టీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ , చార్టర్డ్ అకౌంటెంట్లు, జీఎస్టీ & టాక్స్ ప్రాక్టీషనర్లు, వ్యాపారవేత్తలు, అకౌంటెంట్లు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .