13 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురుచూపులు!

13 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురుచూపులు!

- సీఆర్‌పీల సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే న్యాయ పోరాటమే శరణ్యం.
- రాష్ట్ర అధ్యక్షుడు పాడ్య నాగేశ్వరరావు.

అశ్వారావుపేట, జూన్ 14 (తెలంగాణ ముచ్చట్లు)

సమగ్ర శిక్షలో పనిచేస్తున్న సీఆర్‌పీల సమస్యలు గత 13 సంవత్సరాలుగా పరిష్కారం కాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సీఆర్‌పీ యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పాడ్య నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, అనేక విద్యా సంవత్సరాలు గడిచినా సీఆర్‌పీల సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. ప్రభుత్వాలు మారినా తమ కష్టాలు మారలేదని పేర్కొన్నారు. ఎన్నో ఆశలతో ఉద్యోగంలో చేరిన సీఆర్‌పీలు ప్రతి ఏడాది నిరాశకు గురవుతున్నారని తెలిపారు. బీఈడీ, టెట్ వంటి అర్హతలు కలిగి ఉన్నప్పటికీ ఉపాధ్యాయుల స్థాయిలో కాకుండా కంప్యూటర్ నిర్వహణతో పాటు వివిధ పరిపాలనా పనులు చేస్తూ అధిక బాధ్యతలు నిర్వర్తిస్తున్నామని చెప్పారు. అయినప్పటికీ శ్రమకు తగిన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయిందన్నారు. “సమాన పనికి సమాన వేతనం” సూత్రాన్ని అమలు చేసి సీఆర్‌పీలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విద్యా సంవత్సరంలోనైనా తమ సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో హక్కుల సాధన కోసం న్యాయబద్ధమైన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ పోరాటానికి రాష్ట్రంలోని సీఆర్‌పీ మిత్రులంతా సన్నద్ధం కావాలని పాడ్య నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .