ఆర్టీసీ డిపో పరిధిలో పచ్చదనానికి శ్రీకారం!

పచ్చని పరిసరాలే భావితరాలకు విలువైన ఆస్తి.

ఆర్టీసీ డిపో పరిధిలో పచ్చదనానికి శ్రీకారం!

సత్తుపల్లి, జూన్ 3 (తెలంగాణ ముచ్చట్లు): 

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సత్తుపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం సత్తుపల్లి డిపో ఆవరణలో మొక్కల పెంపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా డిపో పరిధిలోని బస్టాండ్లలో విస్తృత స్థాయిలో మొక్కల పెంపకాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. సత్తుపల్లితో పాటు అశ్వారావుపేట, కల్లూరు, వీఎం బంజర బస్టాండ్లలో ఖాళీ ప్రదేశాలను గుర్తించి మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కనైనా నాటి సంరక్షిస్తే పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో భాగస్వాములవుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ పి. ప్రవీణ్‌కుమార్, ఎల్‌హెచ్ కాంతారావు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు ఆనందం, జాకబ్, ఏడీసీ విజయ్‌కుమార్, డీఐ ప్రభాకర్, వీబీఓ కిన్నెర ఆనందరావు, వెల్ఫేర్ కమిటీ సభ్యులు సైదిరెడ్డి, రాంబాబు, డిపో ఉద్యోగులు పాల్గొన్నారు.IMG-20260603-WA0097

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .