గ్రామాభివృద్ధే లక్ష్యం.. డ్రైనేజీ నిర్మాణ పనులకు సర్పంచ్ చంద్రశేఖర్ శ్రీకారం

గ్రామాభివృద్ధే లక్ష్యం.. డ్రైనేజీ నిర్మాణ పనులకు సర్పంచ్ చంద్రశేఖర్ శ్రీకారం

పెద్దమందడి,జూన్01( తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో 7వ వార్డులో అండర్ మరియు ఓపెన్ డ్రైనేజీల ఏర్పాటు పనులకు గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.గ్రామంలో పారిశుధ్యాన్ని మెరుగుపరచడం, మురుగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించడం లక్ష్యంగా ఈ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు సర్పంచ్ చంద్రశేఖర్ తెలిపారు. గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు గ్రామ పంచాయతీ నిరంతరం కృషి చేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ యాదవ్, 2వ వార్డు సభ్యుడు సింగం కృష్ణయ్య, రగ్మా రెడ్డి, సాయి రెడ్డి, డి. కురుమన్న, కురుమన్న, మన్యం, ధనంజేయ, రవికుమార్, రాములు, నరసింహ, అంజి, కురుమూర్తి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .