వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఆర్డినెన్స్‌తో టెట్ మినహాయింపు కల్పించాలి.

పలుస శంకర్ గౌడ్ జిల్లా సాహితీ కళావేదిక అధ్యక్షులు .

వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఆర్డినెన్స్‌తో టెట్ మినహాయింపు కల్పించాలి.

వనపర్తి,మే30(తెలంగాణ ముచ్చట్లు):

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సమీక్షా పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని, వారికి ఉపశమనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఆర్డినెన్స్ లేదా శాసన సవరణ తీసుకురావాలని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ శనివారం ఒక ప్రకటనలో కోరారు.ప్రభుత్వ నిబంధనలు, నోటిఫికేషన్ల ప్రకారం నియమితులై ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థులకు సేవలందిస్తున్న ఉపాధ్యాయులు ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఈ పరిస్థితి ఉపాధ్యాయుల జీవనోపాధితో పాటు విద్యా వ్యవస్థ స్థిరత్వంపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.గతంలో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు శాసనపరమైన చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని గుర్తుచేసిన ఆయన, ప్రభావిత ఉపాధ్యాయుల సేవా భద్రతను పరిరక్షించేలా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.లక్షలాది మంది ఉపాధ్యాయుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని, వారికి టెట్ నుంచి మినహాయింపు కల్పించే విధంగా ఆర్డినెన్స్ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు పలుస శంకర్ గౌడ్ తెలిపారు.

 

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .