తెలంగాణ ఉద్యమ త్యాగాలను మరువలేం.

మేకల రాజకుమారి.

తెలంగాణ ఉద్యమ త్యాగాలను మరువలేం.

ఎల్కతుర్తి, మే 29 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మహిళా మండల కమిటీ ఎన్నికలు శుక్రవారం ఎల్కతుర్తి మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి నిమ్మల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న మహిళా ఉద్యమకారులను గుర్తించి మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షురాలిగా మేకల రాజకుమారి, ప్రధాన కార్యదర్శిగా గుగులోతు కమలాబాయి, ఉపాధ్యక్షురాలిగా శిధిరం రాధమ్మ, సహాయ కార్యదర్శిగా ముద్రకోళ్ల శాంతమ్మ, కోశాధికారిగా మేకల భాగ్య ఎన్నికయ్యారు.
అలాగే కార్యవర్గ సభ్యులుగా గుండేటి శ్రీలత, పోతురబోయిన వజ్రమ్మ, పోతురబోయిన విజ్జమ్మలను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మండల అధ్యక్షురాలు మేకల రాజకుమారి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు చేసిన త్యాగాలను ఎప్పటికీ మరువలేమని అన్నారు. తొలి దశ ఉద్యమం నుంచి 2014 వరకు వేలాది మంది ఉద్యమకారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కొంతమంది ప్రాణత్యాగాలు కూడా చేశారని గుర్తు చేశారు. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి కార్యకర్తకు గుర్తింపు రావాలని, వారి కుటుంబాలకు న్యాయం జరిగేలా ఫోరం కృషి చేస్తుందని తెలిపారు.
అలాగే ఈ నెల 31న హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించనున్న రాష్ట్ర ఉద్యమకారుల సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులందరూ పెద్ద సంఖ్యలో హాజరై ఉద్యమ స్ఫూర్తిని చాటాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యమకారులు, ఫోరం నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తెలంగాణ ఉద్యమ త్యాగాలను మరువలేం. తెలంగాణ ఉద్యమ త్యాగాలను మరువలేం.
ఎల్కతుర్తి, మే 29 (తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మహిళా మండల కమిటీ ఎన్నికలు శుక్రవారం ఎల్కతుర్తి మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ...
ఆశలన్నీ అగ్నికి ఆహుతి రైతు విద్యాసాగర్‌కు తక్షణ సాయం అవసరం.
వడ్డే కొండయ్య జ్ఞాపకార్థంగా దేవాలయానికి ఐమాక్స్ లైట్ డొనేషన్
ప్రజల భద్రతే లక్ష్యం ఎల్కతుర్తిలో విస్తృత వాహన తనిఖీలు.
తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళన కరపత్రాన్ని విడుదల చేసిన మోత్కుపల్లి .
తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి.
ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి.