ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు కీలక సూచన.

ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి : కౌన్సిలర్ కొలువురు సురేష్

ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు కీలక సూచన.

జమ్మికుంట టౌన్ మే 19 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆసరా పెన్షన్‌ల ఆధార్ అథెంటికేషన్ కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో మంగళవారం ప్రత్యేక వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పెన్షన్ లబ్ధిదారుల ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేశారు.

ఈ సందర్భంగా 8వ వార్డు కౌన్సిలర్ కొలువురు సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వేలో ప్రతి పెన్షన్ దారుడు తప్పనిసరిగా ఆధార్ అథెంటికేషన్ చేయించుకోవాలని సూచించారు. వెరిఫికేషన్ చేయించుకోని వారి పెన్షన్ నిలిచిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు.

పెన్షన్ పొందుతున్న వారిలో జీవించి ఉన్నవారు, మరణించినవారి వివరాలను గుర్తించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అందువల్ల ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ వెరిఫికేషన్‌లో పాల్గొనాలని కోరారు.

అలాగే ఈరోజు అందుబాటులో లేని వారు రేపు లేదా ఎల్లుండి వరకు 8వ వార్డు కార్యాలయంలో వార్డు ఆఫీసర్ క్రాంతికుమార్‌ను సంప్రదించి ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ క్రాంతికుమార్, 8వIMG-20260519-WA0077 వార్డు అధ్యక్షుడు రామంచ శ్రీకాంత్, నాయకులు కనకం చందు, నిమ్మ శ్రీనివాస్, బోయిన మధు, గుల్లి సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .