విధుల్లో కఠినత్వం.. క్రీడల్లో స్వర్ణ విజయం : ఏసిపి మాధవి

విధుల్లో కఠినత్వం.. క్రీడల్లో స్వర్ణ విజయం : ఏసిపి మాధవి

జమ్మికుంట టౌన్ మే 16 (తెలంగాణ ముచ్చట్లు):

ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో నిర్వహించిన అఖిల భారతీయ పోలీస్ క్రీడా పోటీల్లో హుజూరాబాద్ ఏసిపి వి. మాధవి టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా మాస్టర్ క్రీడాకారులు శనివారం ఆమె కార్యాలయానికి వెళ్లి శాలువాతో సత్కరించి, పూలగుచ్ఛం అందజేసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మాస్టర్ క్రీడాకారులు మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలందించడమే కాకుండా, క్రీడల పట్ల ఆసక్తితో సాధన చేసి జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించడం గర్వకారణమన్నారు. ఏసిపి మాధవి మహిళలకే కాకుండా యువతకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.
క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికి మాత్రమే కాకుండా వ్యక్తిగత ప్రతిభను నిరూపించుకునే గొప్ప వేదిక అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ మారేపల్లి మొగిలయ్య, అంతర్జాతీయ క్రీడాకారులు వంతడుపుల రఘు, డాక్టర్ అంబాల ప్రభాకర్ (ప్రభు), మంద జగన్, మామిండ్ల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .