డెంగ్యూ నివారణలో ఆరోగ్య సిబ్బంది కీలక పాత్ర పోషించాలి.

డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రవణ్ కుమార్.

డెంగ్యూ నివారణలో ఆరోగ్య సిబ్బంది కీలక పాత్ర పోషించాలి.

హుజురాబాద్,మే 16(తెలంగాణ ముచ్చట్లు )

హుజురాబాద్‌లో జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాన్ని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రవణ్ కుమార్ ప్రారంభించారు. వర్షాకాలంలో వ్యక్తిగత పరిశుభ్రత నిర్వహణలో ప్రతిభ కనబరిచాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. అనంతరం ఆరోగ్య సిబ్బందితో కలిసి డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రతిజ్ఞ చేయించారు.
గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య పనులను సమర్థవంతంగా పంచాయితీ సిబ్బందితో కలిసి ఇంటిoటికీ తిరుగుతూ  ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి శుక్రవారం నిర్వహించే డ్రైడే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ దోమల నివారణ చర్యలు చేపట్టి ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు.
ఆరోగ్య సిబ్బంది నిరంతర కృషితోనే వ్యాధుల నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సదానందం, జిల్లా ఆరోగ్య బోధకులు పంజాల ప్రతాప్ గౌడ్, సబ్ యూనిట్ ఆఫీసర్ రాజేంద్ర రాజు, హెల్త్ అసిస్టెంట్ సత్యం తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా శీలంశెట్టి వీరభద్రం ఏకగ్రీవ ఎన్నిక. మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా శీలంశెట్టి వీరభద్రం ఏకగ్రీవ ఎన్నిక.
ఖమ్మం బ్యూరో, మే 16(తెలంగాణ ముచ్చట్లు ) మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా శీలంశెట్టి వీరభద్రం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతోపాటు సంఘం జిల్లా...
విధుల్లో కఠినత్వం.. క్రీడల్లో స్వర్ణ విజయం : ఏసిపి మాధవి
రెండు వారాలు గడిచినా ధాన్యం డబ్బులు లేవు… ఐకేపీ సెంటర్ నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం.
పల్లెకు వెళ్లొస్తా” అన్న భద్రయ్య.. మృతదేహంగా తిరిగొచ్చాడు.
బైక్ ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు.. ఆలస్యంగా ఫిర్యాదు.
సలీం సేవలను కాంగ్రెస్ ఎప్పటికీ మరవదు : తాజుద్దీన్
డీజిల్, పెట్రోల్ ధరల పెంపుతో సామాన్యుడిపై పెనుభారం : సొల్లు బాబు