పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన ర్యాలీ.

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన ర్యాలీ.

సత్తుపల్లి, మే 16(తెలంగాణ ముచ్చట్లు): 

కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. సత్తుపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీ బాలాజీ థియేటర్ మీదుగా ఓల్డ్ బస్టాండ్ వరకు కొనసాగింది. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ మార్గనిర్దేశనం చేశారు. నాయకులు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రిహానా బేగం కమల్ పాషా, వైస్ చైర్‌పర్సన్ బొంతు సుమలత, మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె చెన్నారావు, చల్లగుళ్ళ నరసింహారావు, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు సందీప్ గౌడ్,  కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువజన నాయకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .