ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రజాప్రతినిధుల పిలుపు.

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రజాప్రతినిధుల పిలుపు.

ఎల్కతుర్తి , మే 14( తెలంగాణ ముచ్చట్లు):
 
“ప్రైవేట్ స్కూల్ వద్దు… గవర్నమెంట్ స్కూల్ ముద్దు” అనే నినాదంతో గోపాలపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల చేరికలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజలకు ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్య, ఇంగ్లీష్ మీడియం బోధన, డిజిటల్ తరగతులు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాల గురించి వివరించారు.
మన గ్రామ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నాయకులు పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి విద్యాభివృద్ధికి సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గోపాలపూర్ ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రప్రకాశ్ గారు, పాఠశాల విద్యా అభివృద్ధి కమిటీ చైర్మన్ కంచర్ల శారద గారు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గోపాలపూర్ ప్రధానోపాధ్యాయుడు కిషన్ రావు గారు, పాఠశాల విద్యా అభివృద్ధి కమిటీ చైర్మన్ సులోచన గారు, గోపాలపూర్ బస్టాండ్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సదానందం గారు, పాఠశాల విద్యా అభివృద్ధి కమిటీ చైర్మన్ అనూష గారు పాల్గొన్నారు.
అలాగే గ్రామ సర్పంచ్ కర్రే లక్ష్మి గారు, ఉపసర్పంచ్ మరుపాక సందీప్ గారు, వార్డు సభ్యులు శ్రీపతి లావణ్య, రజిత, సంబరాజు స్వప్న, మనోజ్, శివ, సంధ్యారాణి, చరణ్, భాస్కర్ తదితరులు పాల్గొని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .