రైల్వే కోచ్ ఫ్యాక్టరీలోస్థానికులకు 80% ఉద్యోగాలు ఇవ్వాలి
Views: 2
On
కాజీపేట్ మే 10 ( తెలంగాణ ముచ్చట్లు)
కాజీపేట్ జంక్షన్ సమీపంలోనీ అయోధ్య పురం గ్రామంలో నిర్మిస్తున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూమిని కోల్పోయిన భూ నిర్వాసితులతో పాటు అప్రెంటిస్ చేసిన ఐటిఐ విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని సిపిఎం కాజీపేట మండల కార్యదర్శి ఓరుగంటి సాంబయ్య ఆధ్వర్యంలో కాజీపేట్ రైల్వే ఎస్ ఆర్ ఎం యూనియన్ ఆఫీస్ నుండి కాజీపేట్ చౌరస్తా వరకు ప్రజాసంఘాల ఐక్యవేదిక, సెంటర్ ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్, భారత కమ్యూనిస్టు పార్టీ లు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాజీపేట్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఓరుగంటి సాంబయ్య మాట్లాడుతూ భూ నిర్వాసితులకు భూమి ఇచ్చే ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తామని తెలిపారు. కానీ ఆ మాటే ఇప్పుడు ఎత్తడం లేదు అని ఆరోపించారు. రైల్వే యాక్ట్ ప్రకారం స్థానికులకు 80% ఉద్యోగాలు ఇవ్వాలని ఉంది, కానీ ప్రభుత్వం కానీ రైల్వే అధికారులు కానీ ఏటువంటి హామీలు ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. స్థానిక రైల్వే అధికారులకు ఎమ్మార్వో, ఆర్డీవో, జిల్లా కలెక్టర్ కు పలుమార్లు వినతి పత్రాన్ని ఇచ్చిన సమస్య పరిష్కారానికి ఎవరు చొరవ చూపడం లేదన్నారు. ప్రధాని మోడీ హైదరాబాదుకు వస్తున్న సందర్భంగా అతనికి దృష్టికి తీసుకెళ్లేందుకు రాస్తారోకో చేస్తున్నామన్నారు. కోచ్ ఫ్యాక్టరీలో కార్మికులకు ఐటిఐ అప్రెంటిస్ చేసిన వారికి భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవన్నీ పక్షంలో త్వరలో నిరసన దీక్షలను ప్రారంభిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జరిపోతుల సాంబయ్య బిక్షపతి చుక్కయ్య విలాసాగర్ ప్రదీప్ చంపల రమేష్ వెంకటేష్ లతోపాటు ప్రజాసంఘాల నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
10 May 2026 20:58:38
హుజురాబాద్, మే 10(తెలంగాణ ముచ్చట్లు ):
కాలం పరుగులు తీసినా… జీవితాలు ఎన్నో మలుపులు తిరిగినా… పాఠశాల రోజుల స్నేహం మాత్రం ఎప్పటికీ చెదరదనే విషయాన్ని హుజురాబాద్...


Comments