పంట మార్పిడితో రైతులకు అధిక లాభాలు
-- జిల్లెల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు
Views: 4
On
పెద్దమందడి,మే7(తెలంగాణ ముచ్చట్లు):
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం, రైతు వారోత్సవాల్లో భాగంగా గురువారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి రైతు వేదికలో వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ..రైతులు సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా పంట మార్పిడి పద్ధతులను అనుసరిస్తే అధిక లాభాలు సాధించవచ్చని సూచించారు.ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు.వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రాముఖ్యత, డ్రోన్ల వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను అధికారులు ప్రదర్శనల ద్వారా వివరించారు. అలాగే సోలార్ పంపుసెట్ల వినియోగం, ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు కలిగే ఆదాయ అవకాశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వ్యవసాయ అధునాతన యంత్రాల స్టాల్స్, డ్రోన్ ప్రదర్శనలు రైతులను ఆకట్టుకున్నాయి.కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, రైతు కమిషన్ సభ్యురాలు భవాని, గ్రామ సర్పంచ్ మంజుల, వీరాయిపల్లి గ్రామ సర్పంచ్ వెంకటేష్, వ్యవసాయ శాఖ అధికారులు, విద్యుత్ శాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments