హైకోర్టు ఆదేశాలతో పాత బోర్డు పునరాగమనం .
సింగిల్ విండో చైర్మన్‌గా కుండాల్ రెడ్డి బాధ్యతలు స్వీకారం.
Views: 6
On
హుజురాబాద్ మే 5(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్‌లో సింగిల్ విండో చైర్మన్‌గా కుండాల్ రెడ్డి మంగళవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. పాత పాలకవర్గానికి తిరిగి అధికార బాధ్యతలు అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో, సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో పాత పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో సీఈవో గోస్కుల వివేకానంద ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం జరిగింది. సిబ్బంది మహేందర్ రెడ్డి, విజయ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
హైకోర్టు నిర్ణయంతో పాత పాలకవర్గం తిరిగి బాధ్యతలు చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments