పశువుల అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన నిఘా.
అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్‌ను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా.
Views: 6
On
మంచిర్యాల. మే 05(తెలంగాణ ముచ్చట్లు)
రానున్న బక్రీద్పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ లోని మంచిర్యాల జోన్ పరిధిలో ప్రత్యేక చర్యలు చేపట్టారు, ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాపన్‌పల్లి వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్‌ను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పర్యవేక్షించారు, అనంతరం చెక్‌పోస్ట్ వద్ద ఉన్న భద్రతా చర్యలను పరిశీలించి విధుల్లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు, పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సంబంధిత పత్రాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని తెలిపారు, అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు, విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు, కార్యక్రమంలో చెన్నూర్ సిఐ బన్సీలాల్, కోటపల్లి ఎస్‌ఐ రాజశేఖర్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments