ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం.

బీజేపీ నాయకుడు కిషన్ నాయక్

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం.

పెద్దమందడి,మే01(తెలంగాణ ముచ్చట్లు):
 
వనపర్తి జిల్లాలో  రైతుల పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోందని బీజేపీ నాయకుడు కిషన్ నాయక్ విమర్శించారు.శుక్రవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వీరయ్యపల్లి గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆయన, అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కిషన్ నాయక్ మాట్లాడుతూ.. వనపర్తి జిల్లాలో సుమారు 180కి పైగా రైస్ మిల్లులు ఉన్నప్పటికీ, 2026 యాసంగి సీజన్‌కు ఇప్పటివరకు అతి తక్కువ  రైస్ మిల్లులకు మాత్రమే అలాట్మెంట్ ఇవ్వడం జరిగిందని ఆరోపించారు.దీంతో రైతులు ఆరుకాలం కష్టపడి పండించిన ధాన్యం ఎండకు నష్టపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రారంభించామని చెప్పుకుంటూ ప్రచారానికి మాత్రమే పరిమితమవుతోందని, భూమిపై వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉందని అన్నారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కొనుగోలు ప్రక్రియ సక్రమంగా ప్రారంభం కాలేదని, రైతులు తమ పంటతో కొనుగోలు కేంద్రాల వద్ద రోజులు తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.వనపర్తి నియోజకవర్గంలోని కొన్ని కేంద్రాల్లో జల్లెడలు వంటి ప్రాథమిక సదుపాయాలు కూడా లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటనలు ఒకలా ఉండి, అమలు మరోలా ఉండడం రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తోందని విమర్శించారు. రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో అధికార పార్టీ నాయకులు ప్రచారంతో కాలం గడపడం సరికాదన్నారు.సంబంధిత ఎమ్మెల్యే మరియు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ధాన్యం కొనుగోలు పూర్తిస్థాయిలో ఎప్పుడు ప్రారంభమవుతుందో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.అన్ని కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు తక్షణమే కల్పించాలని, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని కోరారు.లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కిషన్ నాయక్ హెచ్చరించారు. రైతుల పక్షాన నిలబడటం తమ బాధ్యత అని స్పష్టం చేశారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .