సత్తుపల్లి వసతి గృహం విద్యార్థుల మెరుగైన ప్రతిభ.
వంద శాతం ఉత్తీర్ణత నమోదు.
Views: 6
On
సత్తుపల్లి, ఏప్రిల్ 29(తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి బాలుర వసతి గృహానికి చెందిన విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో మెరుగైన ప్రతిభ కనబరిచారు. మొత్తం 19 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరై, అందరూ ఉత్తీర్ణత సాధించి వంద శాతం ఫలితాన్ని నమోదు చేశారు.
విద్యార్థులలో 4 మంది 500కు పైగా మార్కులు సాధించగా, మరో 5 మంది 450కు పైగా మార్కులు సాధించడం గమనార్హం. గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు కష్టపడి చదివితే ఎలాంటి ఫలితాలు సాధించవచ్చో ఈ విజయంతో మరోసారి రుజువైంది. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను వసతి గృహ సంక్షేమ అధికారి ఎం. రమేష్ అభినందించారు. విద్యార్థుల కృషి ఫలితంగా ఈ విజయాన్ని సాధించారని పేర్కొంటూ, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments