సదాశివునిపాలెం జెడ్పీహెచ్ఎస్ సత్తా.

సదాశివునిపాలెం జెడ్పీహెచ్ఎస్ సత్తా.

వంద శాతం ఉత్తీర్ణత.
- 578 మార్కులతో లాస్య ప్రసన్న టాప్.

సత్తుపల్లి, ఏప్రిల్ 29(తెలంగాణ ముచ్చట్లు):

పదో తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో సత్తుపల్లి మండలంలోని సదాశివునిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్ఎస్) విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. పాఠశాలకు చెందిన విద్యార్థిని గుదె లాస్య ప్రసన్న 600 మార్కులకు గాను 578 మార్కులు సాధించి, సత్తుపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ విద్యా సంవత్సరంలో పరీక్షలకు హాజరైన 26 మంది విద్యార్థులందరూ ఉత్తీర్ణులై పాఠశాల వంద శాతం ఫలితాలను నమోదు చేసింది. నాణ్యమైన విద్యకు నిదర్శనంగా 8 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం విశేషం.

 *500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు:*

గుదె లాస్య ప్రసన్న – 578, ఆర్. బాల శ్రీలక్ష్మి – 553, జి. చైత్ర – 552, కె. రితీష్ కుమార్ – 544, ఆర్. పద్మశ్రీ – 536, ఎస్‌డీ. అబ్దుల్ రెహ్మాన్ – 533, ఎం. నవ్యశ్రీ – 529, జి. హర్షిత – 508 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు దమ్మలపాటి కమలకుమారి మాట్లాడుతూ విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల సహకారంతోనే ఈ విజయాన్ని సాధించామని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోరని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇంగ్లీష్ మీడియం మొదటి బ్యాచ్‌లోనే ఈ స్థాయి ఫలితాలు రావడం పట్ల స్థానికులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, వారికి మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయులను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ (ఏఏపీసీ), గ్రామ పెద్దలు, సర్పంచ్, విద్యాశాఖ అధికారులు అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు అజయ్ కుమార్, శ్రీనివాస రెడ్డి, పుల్లారావు, గౌరీ కుమారి, శిరీష, రజిని, సుకన్య, కంభంపాటి వెంకటేష్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.IMG-20260429-WA0082

Tags:

Post Your Comments

Comments

Latest News