శ్రీ రామనామ ఘోషతో మార్మోగిన రంగాపూర్ .
Views: 8
On
హుజురాబాద్,మే 01(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ మండలంలోని రంగాపూర్ గ్రామంలో ఉన్న భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ మాలాదారులు ఆధ్యాత్మిక వేడుకలను ఘనంగా ప్రారంభించారు. 24 గంటల పాటు కొనసాగనున్న “శ్రీరామ జయరామ” నగర సంకీర్తన కార్యక్రమం భక్తి భావాలను ఉప్పొంగించింది.
ఈ సందర్భంగా ఆలయం నుంచి భక్తులు ఊరేగింపుగా బయలుదేరి గ్రామ వీధుల్లో భజనలు, నృత్యాలతో సందడి చేశారు. “జై శ్రీరామ్” నినాదాలతో గ్రామమంతా మార్మోగింది. అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుని సంకీర్తనలు ప్రారంభించారు.
మాలాదారుల రామనామ స్మరణతో రంగాపూర్ గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుని భక్తి పరవశంలో మునిగిపోయింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments