విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి.

వెల్టూర్ సర్పంచ్ అశోక్.

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి.

పెద్దమందడి,ఆగస్టు13(తెలంగాణ ముచ్చట్లు):

విద్యార్థులు కష్టపడి చదువుకుని భవిష్యత్తులో అన్ని రంగాల్లో ఉన్నతంగా ఎదగాలని పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామ సర్పంచ్ అశోక్, ఏఏపీసీ చైర్‌పర్సన్ నందిని సూచించారు. గురువారం వెల్టూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ప్రభుత్వం నూతనంగా పంపిణీ చేసిన స్కూల్ యూనిఫామ్‌లను విద్యార్థులకు అందజేశారు.ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక, ఇతర రంగాల్లో తమ ప్రతిభను చాటుకోవాలని, అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలని కోరారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని అభినందించారు.ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాణం విష్ణు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ శాఖ వెంకటయ్య, మాజీ సర్పంచ్ బాలచంద్రయ్య, గొర్రె వెంకటయ్య, నరాల ఆంజనేయులు, బుస్సయ్య, గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గ్రామ కమిటీల పరిశీలనలో కాంగ్రెస్ నాయకులు. గ్రామ కమిటీల పరిశీలనలో కాంగ్రెస్ నాయకులు.
వేలేరు, ఆగస్టు 13 (తెలంగాణ ముచ్చట్లు): పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా వేలేరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మురావత్ లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు పి....
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ.
పూసల సంఘానికి కమ్యూనిటీ హాల్‌ కోసం సీఎం రేవంత్‌రెడ్డికి వినతి.
ఎన్‌ఐఓఎస్‌ ద్వారా 78 మంది ఖైదీలు పదో తరగతి ఉత్తీర్ణత.
ప్రజల అవసరాల కోసం నిర్మించిన పబ్లిక్ టాయిలెట్‌కు తాళమే దిక్కు.
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి.
అమ్మపల్లి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం