మామిళ్లగూడెం నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్‌గా అర్వపల్లి అఖిల నాగ రమ్య.

మామిళ్లగూడెం నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్‌గా అర్వపల్లి అఖిల నాగ రమ్య.

చిన్ననాటి నుంచే క్రమశిక్షణతో చదువుతూ.. ఉన్నత స్థాయికి ఎదిగిన యువతి*

 **పిల్లలు పుట్టినప్పుడు కాదు వారు భవిష్యత్తులో అభివృద్ధిలోకి వచ్చినప్పుడే నిజమైన ఆనందం అని నిరూపించిన అర్వపల్లి నగేష్-శ్రీలక్మి*

ఖమ్మం బ్యూరో , ఆగస్టు 11(తెలంగాణ ముచ్చట్లు )

మామిళ్లగూడెం లో నివాసం ఉండే మధ్యతరగతి కుటుంబానికి చెందిన అర్వపల్లి నగేష్-  ల  కుమార్తె అఖిల నాగరమ్య, చిన్ననాటి నుండే చదువులో ముందుండి,ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పట్టుదలతో, ఉన్నత చదువులు చదివి  నేడు దేశంలోనే ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించే స్థాయికి ఎదిగారు. కష్టపడి చదివి, లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆమె విద్యా ప్రస్థానం నిరూపిస్తోంది.

 ఎన్ని కష్టాలు ఎదురైనా తన కుమార్తె భవిష్యత్తు బాగుండాలని, ఆర్థికంగా ఎన్నో సమస్యలు తలెత్తిన, కుమార్తెను వెన్ను తట్టి ప్రోత్సహించడంలో తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించారు తద్వారా అఖిల నాగ రమ్య 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మామిళ్లగూడెంలోని మాంటిస్సోరి ప్రైవేట్ స్కూల్‌లో విద్యనభ్యసించారు. అనంతరం ఇంటర్ విద్యను సాహితి జూనియర్ కాలేజీలో పూర్తిచేశారు. ఉన్నత విద్యలో భాగంగా గుంటూరులోని మాస్టర్ మైండ్స్ కాలేజీలో తన చదువును కొనసాగించారు.

విద్యార్థి దశ నుంచే పట్టుదల, క్రమశిక్షణతో చదువుతూ తన లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేసిన అఖిల నాగ రమ్య, తాజాగా ఐసీఐసీఐ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించటం, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు, ఆమెను చదివించిన ఉపాధ్యాయుల్లో ఆనందాన్ని నింపింది.

“విద్యకు కృషి తోడైతే విజయానికి హద్దులు ఉండవు” అన్నట్లుగా అఖిల నాగ రమ్య సాధించిన ఈ విజయాన్ని పలువురు అభినందిస్తున్నారు. ఆమె మరింత ఉన్నత స్థాయికి ఎదిగి, తల్లిదండ్రులకు, చదివిన పాఠశాల–కళాశాలలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారు.

**తల్లిదండ్రుల ఆనందం*

కూతురు చిన్ననాటి నుంచి కష్టపడి చదువుకుని ఉన్నత ఉద్యోగాన్ని సాధించడం పట్ల తల్లిదండ్రులు నగేష్, శ్రీలక్ష్మి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అఖిల నాగ రమ్య భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.

మామిళ్లగూడెం నుంచి ప్రారంభమైన అఖిల నాగ రమ్య విద్యా ప్రయాణం.. ఐసీఐసీఐ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ స్థాయికి చేరుకోవడం నేటి యువతకు స్ఫూర్తిదాయకం.

Tags:

Post Your Comments

Comments

Latest News

విద్యార్థిపై దాడి ఘటనపై బాలల హక్కుల కమిషన్ సీరియస్. విద్యార్థిపై దాడి ఘటనపై బాలల హక్కుల కమిషన్ సీరియస్.
దమ్మాయిగూడ, ఆగస్టు 11 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా దమ్మాయిగూడలోని శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేసిన ఘటనపై తెలంగాణ బాలల హక్కుల...
కత్తితో యువకుడి హల్‌చల్.. కాలనీవాసుల్లో భయాందోళన.
మామిళ్లగూడెం నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్‌గా అర్వపల్లి అఖిల నాగ రమ్య.
వందే భారత్ అవార్డుకు జర్నలిస్టు డాక్టర్ బండి కుమార్ ఎంపిక..
చైతన్య యాత్ర ముగింపు సభను జయప్రదం చేయండి.
నీళ్లు ఉన్నాయని వరి వేస్తే ఇబ్బందులే!
వరి పంటకే మద్దతు ధర, బోనస్ ఇస్తుంటే ఇతర పంటల వైపు ఎలా వెళ్లాలి ?