జవహర్ నగర్ డంపింగ్ యార్డ్‌ను శాశ్వతంగా ఎత్తివేయాలి.

జవహర్ నగర్ డంపింగ్ యార్డ్‌ను శాశ్వతంగా ఎత్తివేయాలి.

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు వినతిపత్రం సమర్పించిన డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ

జవహర్ నగర్, ఆగస్టు 9 (తెలంగాణ ముచ్చట్లు):

జవహర్ నగర్ డంపింగ్ యార్డ్‌ను వెంటనే ఎత్తివేసి శాశ్వతంగా మూసివేయాలని డిమాండ్ చేస్తూ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ ఆధ్వర్యంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కారణంగా నాలుగు మండలాల పరిధిలోని లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కమిటీ సభ్యులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల ప్రాణాలు, ఆరోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణ కోసం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
 
ప్రధాన డిమాండ్లు

1. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్‌ను వెంటనే ఎత్తివేయాలి.
2. డంపింగ్ యార్డ్‌ను శాస్త్రీయ పద్ధతిలో సైంటిఫిక్ కాప్పింగ్ చేసి, పర్యావరణ పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి.
3. భూగర్భ జలాలు, గాలి కాలుష్య నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలి.
4. బాధిత ప్రాంతాల ప్రజలకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి ఉచిత ఆరోగ్య పరీక్షలు, అవసరమైన వైద్య సేవలు అందించాలి.
5. ప్రజలకు పరిశుభ్రమైన మంచినీటిని ఉచితంగా అందించాలి.
డంపింగ్ యార్డ్ గత 25 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలోని ఘన వ్యర్థాలను స్వీకరిస్తోందని, దాని కాలపరిమితి ముగిసినప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ నుంచి చెత్తను తరలించి ఇక్కడే డంపింగ్ చేస్తున్నారని కమిటీ సభ్యులు తెలిపారు.
దీంతో పరిసర ప్రాంతాల కాలనీలు, గ్రామాల ప్రజలు తీవ్ర పర్యావరణ, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. భూగర్భ జలాలు కలుషితం కావడం, గాలి కాలుష్యం, దుర్వాసన, మీథేన్ వాయువుల విడుదల వంటి సమస్యలు ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితులపై శాస్త్రీయ అధ్యయనాలు, నిపుణుల కమిటీలు, సంబంధిత సంస్థల నివేదికలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
ప్రజల ఆరోగ్యం, జీవించే హక్కు, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వంతో, సంబంధిత అధికారులతో చర్చించి తమ డిమాండ్లను అమలు చేయించేందుకు కృషి చేయాలని ఎంపీ ఈటల రాజేందర్‌ను కమిటీ సభ్యులు కోరారు.
అఖిలపక్ష సమావేశాలపై ఎంపీ స్పందన
వినతిపత్రంపై స్పందించిన ఎంపీ ఈటల రాజేందర్.. చిన్నగా ప్రారంభమైన జవహర్ నగర్ రాంకీ డంపింగ్ యార్డ్ కాలపరిమితి ముగిసినప్పటికీ ఇంకా కొనసాగుతుండటం సహించరాని విషయమని అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి తనను డంపింగ్ యార్డ్ అంశంపై అఖిలపక్ష కమిటీ చైర్మన్‌గా ఉండాలని కోరారని, ఆ మేరకు ఇప్పటికే రెండు, మూడు సార్లు సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు.
అయితే డంపింగ్ యార్డ్ ఎత్తివేత కోసం గతంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం నిర్వహించిన స్థానిక ప్రజలు, ఉద్యమకారులకు తెలియకుండా అఖిలపక్ష సమావేశాలు నిర్వహించడం సరైన విధానం కాదని పోరాట కమిటీ సభ్యులు ఎంపీకి వివరించారు.
జవహర్ ప్రజాహక్కుల పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో గతంలో డంపింగ్ యార్డ్ ఎత్తివేత కోసం పెద్ద ఎత్తున పోరాటం చేశామని, ఆ ఉద్యమం ఫలితంగానే కొంత మేర క్యాపింగ్ చేయించగలిగామని తెలిపారు. ప్రజా ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నంలో పలువురిపై తప్పుడు కేసులు నమోదు చేయడంతో పాటు మరికొందరిపై రౌడీషీట్లు కూడా తెరిచారని వారు పేర్కొన్నారు.
డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారంలో గతంలో పోరాడిన స్థానిక ప్రజలు, ఉద్యమకారులను కూడా భాగస్వామ్యం చేయాలని వారు ఎంపీ ఈటల రాజేందర్‌ను కోరారు. **పలువురు నాయకుల పాల్గొనడం **జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్ షావలి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కో-కన్వీనర్లు బీఆర్‌ఎస్‌కు చెందిన ఆలూరి రాజశేఖర్, గడ్డం సదానందం, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, శంకర్ (సీపీఐ), చంద్రమౌళి (పీడీఎం రాష్ట్ర అధ్యక్షులు), ఏఐఎఫ్‌టీయూ వై. మల్లేష్, జయ చైతన్య మహిళా సంఘం, గడిపే సునీత (పీఓడబ్ల్యూ విముక్తి), వి. ప్రవీణ్ (టీయూసీఐ), సుర వెంకటయ్య (బీఎన్‌ఆర్‌కేఎస్), రావల్ కోల్ నర్సింహ గౌడ్ (మాజీ ఉప సర్పంచ్), దామాల ప్రభాకర్ రావు, జయసుధ (పీఓడబ్ల్యూ), వాసంశెట్టి శ్రీనివాసరావు, కొన్నె వేణు (జర్నలిస్ట్), బీఆర్‌ఎస్ ఏ. దుర్గం, పీడీఎస్‌యూ శ్యామ్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి జవహర్ నగర్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు.IMG-20260809-WA0019

Tags:

Post Your Comments

Comments

Latest News