ప్రమాదకరంగా మారిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్.
ఖిల్లా ఘనపూర్,ఆగస్టు05(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం ఆగారం గ్రామంలో గ్రామ నర్సరీ, వైకుంఠధామం సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. నిత్యం నర్సరీలో పనిచేసేందుకు ప్రజలు రాకపోకలు సాగించే ప్రాంతం కావడంతో పాటు, మూగజీవులు సైతం సంచరిస్తున్న ఈ ప్రదేశంలో ట్రాన్స్‌ఫార్మర్‌కు ఎలాంటి రక్షణ చర్యలు లేకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని గ్రామస్తులు పలుమార్లు కోరుతున్నప్పటికీ గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ప్రమాదకర పరిస్థితులు నెలకొనడంతో ఏదైనా అనుకోని ఘటన జరిగితే బాధ్యత ఎవరిదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.ప్రజలు, మూగజీవుల భద్రతను దృష్టిలో ఉంచుకుని గ్రామ పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయాలని ఆగారం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.


Comments