*అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.
* ఆగస్టు 15 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు.. ఇంటర్ అర్హత కలిగిన స్థానిక మహిళలకు అవకాశం
జమ్మికుంట టౌన్ ఆగస్టు 01 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లాలోని పలు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 60 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ఎం. సరస్వతి తెలిపారు.
గంగాధర ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 20, హుజూరాబాద్‌లో 16, కరీంనగర్ రూరల్‌లో 16, కరీంనగర్ అర్బన్ ప్రాజెక్టు పరిధిలో 8 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కలిగిన మహిళలు మాత్రమే అర్హులని, అభ్యర్థి సంబంధిత అంగన్వాడీ కేంద్రం పరిధిలోని గ్రామపంచాయతీ లేదా పట్టణ వార్డు/డివిజన్‌కు స్థానికురాలై ఉండాలని స్పష్టం చేశారు.
2026 జూలై 1 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఖాళీల వివరాలు, రిజర్వేషన్, ఎంపిక విధానం తదితర పూర్తి సమాచారం కోసం https://wdcw.tg.nic.in� వెబ్‌సైట్‌ను సందర్శించి, అదే పోర్టల్ ద్వారా దరఖాస్తు సమర్పించాలని సూచించారు.


Comments