నామమాత్రపు మెడికల్ బోర్డ్ ను వ్యతిరేకించిన ఏఐటీయూసీ.
మంచిర్యాల, జూలై 20, (తెలంగాణ ముచ్చట్లు)
సింగరేణిలో మెడికల్ బోర్డులు పాత పద్ధతిలోనే కొనసాగించాలని, నామమాత్రపు మెడికల్ బోర్డును పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నామని మందమర్రి ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు, సింగరేణిలో గత కొన్ని నెలలుగా మెడికల్ బోర్డు నిర్వహించకుండా యాజమాన్యం కాలయాపన చేసిందని ఆయన పేర్కొన్నారు, గతంలో పెండింగ్ సమస్యలపై మరియు మెడికల్ బోర్డుపై సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందని అదేవిధంగా అన్ని సంఘాలు దీనిపై ఉద్యమాలు చేయడం వల్ల సమ్మె నోటిస్ పై స్పందించిన యాజమాన్యం ఈ నెలలో మెడికల్ బోర్డు నిర్వహించి 20% అన్ఫిట్ ఇన్వాల్యూయేషన్ చేయడానికి సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని హెచ్చరించారు, గతంలో నూటికి యాబై శాతం మెడికల్ ఆన్ఫీట్స్ జరిగేవని కానీ సింగరేణిలో రాజకీయ జోక్యంతో యాజమాన్యం మెప్పు కోసం కార్మికులను ఆందోళన గురి చేస్తుందని తెలిపారు, యాజమాన్యం పూర్తిస్థాయిలో మెడికల్ బోర్డులు నిర్వహించి కార్మికులకు న్యాయం చేయాలని తెలిపారు, ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ కార్యాలయ స్ట్రక్చర్ కమిటీ సభ్యులు సివి రమణ, గోపతి సత్యనారాయణ, నాగేశ్వరరావు, ఫిట్ కార్యదర్శి సంపత్, కుమార్ స్వామి, శ్రీనివాస్, నాగరాజు, తోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Comments