ప్రతి బూత్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి: వొడితల ప్రణవ్.
క్షేత్రస్థాయిలో సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచన.
హుజురాబాద్, జూలై 17(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ఎస్‌ఐఆర్ (ఎస్ ఐ ఆర్ ) కో-ఆర్డినేటర్ల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి బూత్‌లో ఓట్ల సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రతి ఓటు విలువైనదేనని అన్నారు.
బూత్ లెవల్ ఏజెంట్లతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తూ ఓటర్ల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రక్రియను రాష్ట్ర పీసీసీ నిశితంగా పరిశీలిస్తోందని, ఎన్నికల కమిషన్ పొడిగించిన గడువును సద్వినియోగం చేసుకుని ఓట్ల సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని కో-ఆర్డినేటర్లకు పిలుపునిచ్చారు.
గ్రామాలు, వార్డుల్లో ఎదురయ్యే సమస్యలను వెంటనే నియోజకవర్గ ఇంచార్జులు, బీఎల్‌ఓలు, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రాధాన్యంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి కార్యకర్త, బీఎల్‌ఏ, కో-ఆర్డినేటర్లు బాధ్యతగా పనిచేయాలని ప్రణవ్ కోరారు.
ఈ సమావేశంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు, జిల్లా ఉపాధ్యక్షుడు, నియోజకవర్గ ఎస్‌ఐఆర్ కో-ఆర్డినేటర్ సదయ్య, మండల, పట్టణ అధ్యక్షులు, వివిధ గ్రామాల సర్పంచులు, కో-ఆర్డినేటర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


Comments